ప్రార్ధనకు జవాబులు

" రక్షకుని పిలుపు ..." [Français] | [English] | [Español] | [Yoruba] | [Deutsch]
 [ខ្មែរ។] | [தமிழ்] | [বাংলা] | [
Italiano] | [తెలుగు]

ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము;

ఇదిగో, ఇదే రక్షణ దినము

2 కొరింధీయులకు 6:2

ఆయన నిత్యత్వ తొలగింపు

"దేవా, నీ కృప చొప్పున, నన్ను కరుణింపుము; నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము." కీర్తనలు 51:1 (ఎన్ఐవి) (NIV)


నేను రాస్తున్నప్పుడు కీబోర్డ్ పై బ్యాక్ స్పేస్ బార్ నొక్కి ఉంచినప్పుడు, నేను టైపు చేసిన పదాలు నా కళ్ళముందు మాయమైనట్టు అనిపించింది. నేననుకున్నాను,
"ఓ కాదు, నేనేమి చేసాను! ఆ స్థలములో ఉన్న పదాలన్ని ఎప్పటికి పోయాయి." నాలో నేను మాట్లాడుకుంటూ ఇలా అన్నాను, "ఆ వాక్యము ఉంచడానికి నేనిష్టపడలేదని నాకు ఆనందముగా ఉంది." అప్పుడు ఒక తలంపు నాకు వచ్చింది... అలాగే దేవుడు మన తప్పిదాలను కొట్టివేస్తాడు. ఆయన సున్నితంగా స్పేస్ బార్ ముట్టితే అవిపోతాయి, మళ్ళీ తిరిగి కనబడవు.

దేవుడు అదే పని చేస్తున్నాడని తెలుసుకొనుట, ఒక ఆదరణ, ఆయన, తన జీవ గ్రంథములో వ్రాసేటప్పుడు. ఆయన గ్రంథములో మన జీవిత దినములన్నియు, చాలా జాగ్రత్తగా వ్రాయబడ్డాయి. మనకు చెప్పబడింది, ఆయన మన పాపములను కొట్టివేసి తిరిగి వాటిని జ్ఞాపకము చేసుకొనడు. ఊహించుకోవడం నాకిష్టం, నేను నా పాప క్షమాపణ నిమిత్తము అడిగినప్పుడు, ఆయన తన వేళ్ళను, స్పేస్ బార్ పై ఉంచి, జాగ్రత్తగా కొట్టివేస్తాడు. అది వెనువెంటనే దేవుని హస్తముచే తుడిచి వేయబడుతుంది.

దేవుడు మన పాపములను తుడిచి వేయడములో ఒక భాగము మన భాగము. ఒకసారి దేవుడు ఆయన దృష్టి నుండి, ఆ పాపములను తుడిచిన తరువాత మనము వాటిని మన మనసులో నుండి తుడిచి వేయాలి. నేరారోపణ శిక్షా విధితో కూడిన అనవసర తలంపులు మనము కలిగి ఉండకూడదని దేవుడు కోరుచున్నాడు. మనలను క్షమించమని ఆయనను అడిగి ఉంటే, అది జరిగినదని మనము నమ్మాలి. నేను క్షమించబడలేదని చాలాసార్లు నాకు అనిపించేది, కాని నేను నేర్చుకున్నాను మన ఆత్మకు విరోధి మనము నేరారోపణ కలిగియుండాలని కోరుతుంటాడు... దేవుడు కాదు

మీరు హత్తుకొని ఉన్న అనవసర నేరారోపణ నుండి మిమ్ములను విముక్తి చేసుకోండి. దేవుడు మన పాపమును తుడిచి వేశాడని మీరు గుర్తు చేసుకోండి. జాగ్రత్తగా ఆయనను ఊహించుకోండి, ఆయన బ్యాక్ స్పేస్ బార్ పైన తన వేళ్ళను పెట్టి మీ అతిక్రమమును తుడిచి వేసినట్టుగా చూడండి. తరువాత, ఆయన తన నిత్యత్వ తొలగింపు వాడినందుకు, ఆయనకు, వందనాలు చెప్పండి.

యానేట్టి బడ్ జబాన్
AnnetteeBudzban

ప్రార్ధనకు జవాబులు సబ్ స్క్రైబర్,

రక్షణకు పిలుపు:

ఈలోక జ్ఞానము మనలను నమ్మింప చేయవచ్చును ప్రపంచమతాలన్నీ ఒకటే అని, అన్ని మార్గాలు పరలోకానికి తీసుకెళ్తాయని, మనము ఏది ఎవరిని నమ్మేది దానితో సంబంధము లేకుండా. కాని ఇది నిజమా?

యేసు చెప్పాడు, "నేనే మార్గమును మరియు సత్యమును మరియు జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు." యోహాను 14:6

అపోస్తలుల కార్యములు 4:12 ఇలా చెప్తుంది "మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము."

ఈనాడు, నా స్నేహితులారా, నేను చాలా మొండిగా ఉండవచ్చును. మీ హృదయములో యేసును కలిగియుండకపోతే, మీరు రక్షింపబడలేరు! యేసు లేకుండా, రక్షణ లేదు. కాలం. క్షమించండి! ఒకరు మీకు చెప్పడానికి అంతగా ప్రేమించాలి, మరియు ఈనాడు, సత్యము మీకు చెప్పడానికి సమర్పణ చేసుకున్నాను.

"కాని," మీరనవచ్చు, "నేను ఇప్పటికే క్రైస్తవుడను! నేను క్రైస్తవ గృహములో పెరిగాను. మేము బౌద్ధులము, ముస్లీము, యూదులు లేక హిందువులము కాదు మరియు మేము ఈష్టరు మరియు క్రిస్మస్ కు గుడికి వెళ్తాము, కనుక మేము క్రైస్తవులము!"

మీకు తెలుసా బైబిలు ఎక్కడ చెప్పడం లేదు! మీరు క్రైస్తవులని పిలువబడినంత మాత్రాన మీరు పరలోకము నిత్యజీవము పొందుకుంటారని?

"సరే," మీరు జవాబివ్వచ్చు, "కాని నేను క్రైస్తవ పాఠశాలకు వెళ్ళాను. నేను నీటికి సంబందించిన తరగతులు (లేక సబ్బాతు బడి లేక ఆదివారపు బడి తరగతులు) జీవితమంతా హాజరయ్యాను. నేను ఒక సిలువను (లేక సెయింట్ క్రిష్టాఫర్) ను మెడలో వేసుకుంటాను!"

అది సరే, కాని మీకు తెలుసా బైబిలు చెప్పడం లేదు గుడికి వెళ్ళడం, నీటికి సంబందించిన తరగతులు, సబ్బాతు లేక ఆదివారపు బడి తరగతులు హాజరు అవడం లేక ఒక సిలువ లేక సెయింట్ క్రిష్టాఫర్ మీ మెడలో వేసుకోవడం ద్వారా మీరు మీరు పరలోకము నిత్యజీవము పొందుకుంటారని?"
సరే... నేను ప్రతిరోజూ బైబిలు చదువుతాను ప్రార్ధిస్తాను...ప్రతి రోజు!"

మీరు చేస్తున్నందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను! మీరు అలా చేస్తున్నందుకు, మీకు ఇప్పటికే తెలుసు బైబిలు చెప్పడం లేదు ప్రార్ధన ద్వారా బైబిలు పఠనము ద్వారానే మీరు పరలోకము నిత్య జీవము పొందుకుంటారని!"
సరే. కాని నేను దేవుని ప్రేమిస్తాను!"

అది అద్భుతం. కాని మీకు తెలుసా 19 మంది ఉగ్రవాదులు సెప్టెంబర్ 11, 2001 న, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెంటగాన్ మీద విమానాలతో దాడి చేసిన వారు కూడ చెప్పారు వారు దేవుని ప్రేమించారని?

మీకు తెలుసా బైబిలు ఎలాంటి దాని గుర్తించి చెప్పడం లేదు దేవుని పట్ల మీ ప్రేమను బట్టి మాత్రమే మీరు పరలోకము నిత్యజీవము పొందుకుంటారని?

"
కాని ఒకసారి ఒకరు నాతో చెప్పారు యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తే, నేను పరలోకానికి వెళ్తానని నిత్యజీవము పొందుకుంటానని..."

మళ్ళీ నేను మొండిగా ఉండనా? బైబిలు చెప్తుంది దయ్యములు కూడ యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతాయి (యాకోబు 2:19), మరియు సాతానే స్వయముగా యేసు దేవుని కుమారుడని నమ్ముతుంది! బైబిలు చెప్తుంది సాతానుకు తన దూతలకు యేసు నిత్యాగ్నిని సిద్ధ పరచి యుంచాడు. (మత్తయి 25:41)! యేసులో వారి విశ్వాసము తప్పకుండా పరలోకములో నిత్య జీవము వారికి ఇవ్వదు!

"కాని నా జీవితము అంతా నేను పది ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాను!"

అది గొప్ప విషయము! కాని మీకు తెలుసా పది ఆజ్ఞలు గైకొనడం మీకు నిత్య జీవమును ఇస్తుందని బైబిలు చెప్పడం లేదు అని? నా స్నేహితులారా, అది పుస్తకములో లేదు!

ఒక్క క్షణం నోకోదేము కథను గూర్చి ఆలోచిద్దాం. నికోదేము పరిశయ్యుడు, ధర్మ శాస్త్రమును ఖచ్చితముగా పాటించువాడు. లేఖనము కంఠస్తము చేసాడు, లేఖనము పాడాడు ప్రతి సబ్బాతు దినాన దేవుని వాక్యము నుండి బోధించేవాడు. ఒకరు అనుకోని ఉండవచ్చు నికోదేము యేసు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువు అతని భుజముపై తట్టి,
"బాగా చేసావు, నిక్! పరలోకము నీ కొరకు కనిపెడుతుంది!"

కాని ప్రభువు నోకోదేముతో అలా చెప్పలేదు. దానికి బదులు, ఒకడు నీటిమూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప, అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పాడు.

ఆయన నికోదేముతో చెప్పాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:3). మీకు దీని భావము ఏమనిపిస్తుంది? దాని అర్ధము పరలోకానికి వెళ్ళడానికి నిత్యజీవము పొందుకోడానికి నీవు తిరిగి జన్మించాలి!

కనుక తిరిగి జన్మించడం అంటే అర్ధమేమిటి?

దాని అర్ధము నీవు నీ హృదయాన్ని మొత్తం తప్పక నీ జీవితమంతటిని యేసుకి ఇవ్వాలి. అది అంత సామాన్యము! ఇప్పటి వరకు ఎప్పుడు అలా చెయ్యకపోతే, నీవు ఇంకా రక్షింపబడలేదు. (మళ్ళీ, నన్ను క్షమించండి! మీకు ఇది చెప్పడానికి ఒకరు మిమ్మును అంతగా ప్రేమించాలి.)

ఆదికాండము 1:1 నుండి బైబిలు చివర పటాలు వరకు, దేవుని వాక్యము ఎన్నడు మారదు! నీవు దేవునికి నీ హృదయమంతా నీ జీవితమంతా ఇచ్చేయాలి. దీని అర్ధము యేసు నీ జీవితానికి తప్పక ప్రభువుగా ఉండాలి. దీని అర్ధము నీవు ఆయనను నీ అధిపతిగా చేసుకోవాలి! నీవు నీ జీవితానికి ఆయనను ఎప్పుడు అధిపతిగా చేసుకోకపోతే, నీవు రక్షింపబడలేదు. ఇది అంత సామాన్యము.

"కాని నేను బిల్లీ గ్రేహం కూటములో రక్షణ ప్రార్ధన చేసాను (లేక ఒక కోత పండుగ కూటములో)! ఒకసారి మా సంఘములో బలిపీఠపు పిలుపుకు నేను జవాబిచ్చాను!"

అది గొప్ప విషయము! కాని నీ జీవితమూ ప్రార్ధనను వెంబడిస్తుందా?

మీకు తెలుసా ప్రార్ధించడం మిమ్మును పరలోకానికి తీసుకెళ్తుందని బైబిలు ఎక్కడ చెప్పడం లేదని?

తప్పకుండ, ప్రార్ధన ప్రాముఖ్యము, కాని నీవు ప్రార్ధించినప్పుడు నీ హృదయమంతటిని నీ జీవితమంతటినీ ఆయనకు సమర్పించావా? నీ జీవితానికి ఆయనను అధిపతిగా చేసుకున్నావా? లేక అది
"అగ్నిభీమాలా" ఉందా అంటే నమ్మకముతో నీకు ఇష్టము వచ్చినట్టు జీవించడం నరకానికి వెళ్తానన్న భయము లేకుండా?

నేను మీకొక విషయము చెప్పనా? అది అంత సులువుగా పనిచెయ్యదు. ఇది దేవునితో పూర్తి లేక ఏమి లేని సంబంధము. మీ హృదయమంతా మీ జీవితమంతా ఆయనకు ఇవ్వాలి, మీ జీవితానికి ఆయనను అధిపతిగా చేసుకోవాలి, లేకపోతే మీరు రక్షింపబడలేనట్లే! (మరియు మీకు నిజము చెప్పడానికి ఒకరు మిమ్ములను అంతగా ప్రేమించాలి.)

నా స్నేహితులారా, మిమ్ములను మీరు సరిచేసుకోడానికి ఇది సమయము! ఈరోజు మీ రక్షణ దినము. ఒక క్షణములో, దేవునితో మీరు సరి చేసుకోడానికి ఒక అవకాశము ఇవ్వబోతున్నాను, మీ హృదయమంతా మీ జీవితమంతా ఆయనకు సమర్పించడానికి, పరలోకములో నిత్యజీవము పొందుకుంటామన్న నిశ్చయత మీరు అందుకోవడానికి.

"ఈ పిలుపుకు ఎవరు స్పందించాలి?"

కొన్ని ప్రశ్నలడగడం ద్వారా మీకు జవాబు ఇస్తాను:

నీవెప్పుడైనా యేసుకు నీ హృదయమంతా నీ జీవితమంతా సమర్పించావా? అలా చెయ్యకపోతే, ఈరోజు నీ రక్షణ దినము!

నీవెప్పుడైనా యేసును నీ జీవితానికి అధిపతిగా చేసుకున్నావా? అలా చెయ్యకపోతే, ఈరోజు నీ రక్షణ దినము!

నీవు నీ జీవితాన్ని నీ కొరకే జీవిస్తున్నావా లేక యేసు కొరకు జీవించడం లేదా? అలాగయితే, ఈరోజు నీ రక్షణ దినము!

నీవు దేవుని దగ్గరకు కాకుండా దేవుని నుండి దూరముగా పారిపోవుచున్నావా? అలాగయితే, ఈరోజు నీ రక్షణ దినము!

నీ హృదయములో కాకుండా యేసును నీ తలలో కలిగియున్నావా? అలాగయితే, ఈరోజు నీ రక్షణ దినము!

ఒకవేళ ఈ సన్నివేశాలలో నీవుంటే, నేను మీతో పాటు ఒక ప్రార్ధన చేయాలనుకుంటున్నాను.

ఒకవేళ ఈ సన్నివేశాలలో నీవు లేకపోతే...నిర్ధారణ చేసుకోండి!

నేను మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఆశ్చర్య పోతున్నారా... నేను మీతో మాట్లాడుతున్నాను!

ఈరోజు మీ రక్షణ దినము!

ఇప్పుడు నీవు యేసు క్రీస్తును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, నీ ప్రభువుగా రక్షకునిగా, నీ అధిపతిగా, నీ హృదయమంతటిని నీ జీవితమంతటిని ఇప్పుడు ఆయనకు సమర్పించాలనుకుంటే, దయచేసి చెప్పండి, "అది నేనే! మీరు నన్నే అభివర్ణించారు, నేను జీవితకాలమంతా యేసుతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను!"

హల్లెలూయా!

మీరు ఒకవేళ ఈ పిలుపునకు స్పందిస్తే జవాబు ఇస్తే, దయచేసి క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చెయ్యండి...

 

దయచేసి ఇప్పుడు లింక్ ను వెంబడించండి...

  

[Video Version] | [Français] | [English] |[Español] | [Yoruba] | [Duetsch] [ខ្មែរ។] | [தமிழ்]  | [বাংলা] | [Italiano] | [తెలుగు]

 

“అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది; 
వెతకండి మరియు మీరు కనుగొంటారు;
కొట్టు, తలుపు మీకు తెరవబడుతుంది ’మాట్ 7: 7

© 2002 Answers2PrayerReceive our free newsletters


The Illustrator: This daily newsletter is dedicated to encouraging everyone to look towards Jesus as the source of all the solutions to our problems. It contains a daily inspirational story, a Bible verse and encouraging messages. HTML and plain text versions available. 

 

The Nugget: Published three times a week, this newsletter features inspirational devotionals and mini-sermons dedicated to drawing mankind closer to each other and to Christ.

Visit Answers2Prayer

Subscribe Here:
The Illustrator
The Nugget

Your email:

Be aware that you will receive a confirmation message. Once you receive it, please click on the link mentioned in the email.

 

About Answers2Prayer  Bible Studies 

Healing  Prayer Contact Us

© Answers2Prayer